అనకాపల్లిలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అనకాపల్లి నియోజకవర్గం, అనకాపల్లి పట్టణంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం మరియు వాలంటీర్లకు సన్మానం కార్యక్రమంలో భాగంగా పట్టణానికి చెందిన వాలంటీర్లను నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు జనసేన జెండా కప్పి ప్రశంసా పత్రాన్ని అందజేసి మెమెంటోతో సత్కరించారు. అనంతరం క్రియాశీలక సబ్యులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.