పత్తికొండలోలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పత్తికొండలో స్థానిక కన్యకాపరమేశ్వరి కళ్యాణ్ మండపంలో క్రియాశీల కార్యకర్తలకు కిట్ల ప్రధాన కార్యక్రమం జరిగింది. అలానే క్రియాశీల సభ్యత్వం నమోదు చేసినటువంటి వాలంటీర్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి సుభాషిని, రాయలసీమ ప్రాంతీయ వీరమహిళా కమిటీ చైర్మన్ హసీనా బేగం కర్నూల్ జిల్లా నాయకులు చల్ల వరుణ్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థానిక నాయకులు బోయ గోవింద్, వై.పి.క్రాంతికుమార్, చిప్పగిరి రాజశేఖర్, రామకృష్ణ, అశోక్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలానే నియోజకవర్గ నలుమూలల నుండి జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.