డీకే పట్నం గ్రామ పంచాయతీ తాగునీరు సమస్యపై జనసేన పోరాటం

పార్వతీపురం: డీకే పట్నం గ్రామ పంచాయతీలో తాగునీరు సమస్యపై జనసేన చేస్తున్న పోరాటంలో భాగంగా పార్వతీపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మని నాయకుడు అక్కివరపు మోహన్ రావు, జనసేన యువనాయకులు, జనసైనికులు మరియు పంచాయతీ యువత గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గురువారం పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఏదైతే జనసేన పార్టీ మీద విమర్శలు చేశారు. అక్కడ తాగునీరు సమస్య లేదని, జనసేన పార్టీ వాళ్ళు సమస్యలు సృష్టిస్తున్నారని. ఈ వ్యాక్యలను ఖండిస్తూ శనివారం జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ వెళ్ళి, అక్కడ ప్రజలకు ఎంతో వివరంగా సమస్య ను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడటం ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. సమస్య ఉంది కాబట్టే జనసేన పార్టీ ఆ సమస్య మీద పోరాడుతుంది. ఎమ్మెల్యే గారు మీకు మేము కొన్ని వీడియోస్ ఫొటోస్ పెడతాం. మీరే ఒకసారి చూడండి చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని జనసేన పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, చిట్లి గణేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, అల్లు రమేష్ గారు, కర్రీ మణికంఠ, అన్నేబత్తుల దుర్గాప్రసాద్, ఖాతా విశ్వేశ్వరరావు, పాత్ర పవన్, అక్కేన భాస్కరరావు, అంబటి బలరాం, పైల రాజు, దుర్గా, కేశవరావు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాగే రానున్న రోజుల్లో మన పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పని చేయాలి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం జనసైనికులకి, సీతానగరం మండల జనసైనికులకి పేరు పేరునా పార్వతీపురం మండల జనసేన తరుపున ముఖ్యంగా డీకే పట్నం, గ్రామపంచాయతీ గోచక్క, పంచాయతీ జనసైనికులు అందరికీ డోకిశీల, పంచాయతీ జనసైనికులు అందరికీ జనసెన తరఫున ధన్యవాదములు తెలిపారు.