మయన్మార్ శరణార్ధులకు ఆహరం, ఆవాసం ఇవ్వొద్దు…

మయన్మార్ లో ప్రస్తుతం సైనిక పాలన ఉంది. ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని కాదని, సైన్యం అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ప్రజలు చేస్తున్న తిరుగుబాటును సైన్యం తుపాకులతో అణిచివేయడం మొదలుపెట్టింది. దీంతో అక్కడి ప్రజలు భయపడి ఇండియాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మయన్మార్ తో సరిహద్దుగా ఉన్న మణిపూర్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. మయన్మార్ నుంచి వచ్చే శరణార్థులను మణిపూర్ రాష్ట్రంలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. అక్రమంగా ప్రవేశిస్తే వారిని తిరిగి వెనక్కి పంపించేయాలని ముఖ్యమంత్రి బైరన్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. శరణార్ధుల కోసం ఎలాంటి ఆహరం, ఆవాసం వంటివి ఏర్పాటు చేయరాదని పేర్కొంది. అదే విధంగా ఎవరైనా గాయాలతో వస్తే వారికి మానవతా దృక్పథంతో వైద్యం అందించాలని బైరన్ సింగ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.