నిరుద్యోగుల గోడు వినిపించదా: భరత్

యువత చదువుకుని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా తిరుగుతున్నారని జిల్లా నాయకులు భరత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత కి సబ్సిడీ లోన్ లు, పారిశ్రామిక వేత్తల కింద లోన్ లు, ప్రోత్సాహకాలు సరిగా ఇవ్వడం లేదని.. అందువల్ల యువత విదేశాలకు వలస పోతున్నారని. ఎంబీఏ చదివిన వారు కూడా టీ కొట్టులు, పండ్ల దుకాణాలు పెట్టుకుని గిట్టుబాటు కాక అప్పులు పాలు అవుతున్నారు.. ఈ దయనీయ పరిస్థితిని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. నిరుద్యోగులని ఓటు బ్యాంక్ గా నే చూస్తున్నారు తప్ప వారి సమస్యలని పరిస్కారం చేయడం లేదు. జనసేన వస్తే నిరుద్యోగులకు వ్యాపారవకాశాలని కల్పిస్తాం అని ఈ సందర్భంగా భరత్ తెలియ చేశారు.