పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకోము

*అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్

కళ్యాణదుర్గం నియోజకవర్గం, ఏపి రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోంది, ఈ మంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ఏంటి, మంత్రులు వారి శాఖల గురించి సబ్జెక్ట్ లేని వారిని మంత్రులుగా నియమించారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మీరు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా, వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు ఉన్న మీ పార్టీ 15 సీట్లకు పరిమితం చేస్తాం,మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా విమర్శించడం పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు… పవన్ కళ్యాణ్ గారు మీ పాలసీలు, విధానాల పరంగా విమర్శిస్తే మీరు ఆయన వ్యక్తిగత జీవితం గురించి వారి కుటుంబ సభ్యులు ఆడవాళ్ళ గురించి మాట్లాడితే మరొక సారి మిమ్మల్ని రోడ్లపైన తిరిగి నీచ్చే ప్రసక్తే లేదు అని హెచ్చరించడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ప్రజలే మీకు గట్టిగా గుణపాఠం చెబుతారు. 3 వేలమంది కౌలు రైతుల కోసం ‌30 కోట్లు సొంత డబ్బుతో ఒక్కొక్క చనిపోయిన రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ రైతు భరోసా యాత్ర ద్వారా ఏక్కడ ప్రజల్లో మరింత జనసేన పార్టీ బలోపేతం అవుతుందో అని భయపడి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. వైసిపి వాళ్ళు ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గరు. మీ కన్నా బలంగా మాట్లాడగలం అవినీతితో పార్టీని నడుపుతున్న మీరు నీతి నిజాయితీ ప్రజా సేవే పరమావధిగా ఆశయాలు సిద్ధాంతాలతో మా జనసేన పార్టీని నడుపుతున్న మాకు ఎంత ధైర్యం ఉండాలి ఆలోచించుకోండి.. ఖబర్దార్ వైసిపి నాయకుల్లారా… ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జాకీర్, వంశీ పాల్గొనడం జరిగింది.