ప్రజా సమస్యలు మీకు పట్టవా!.. చేతకాకపోతే గద్దె దిగండి..! వైసీపీ నేతలపై మాకినీడి ఫైర్

రాష్ట్ర అభివృద్ధికి జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే కార్యక్రమంలో భాగంగా పలు వార్డులలో మాకినీడి పర్యటిన

పిఠాపురం: రాష్ట్ర అభివృద్ధికి జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనే కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా, పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు సమస్యలపై, పిఠాపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాకినీడి శేషు కుమారి పలు వార్డులలో పర్యటిస్తూ, ప్రభుత్వ పనితీరుపై, మున్సిపాలిటీ పనితీరుపై, పలు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఆమె పిఠాపురం పట్టణం ఒకటో వార్డు అగ్రహారం నందు పర్యటించి డ్రైనేజీ సమస్యలను, కుల్లాయి, విద్యుత్తు సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకుని, మున్సిపల్ అధికారుల, సిబ్బంది పనితీరు, మున్సిపల్ చైర్మన్ యొక్క పనితీరుపై, నిప్పులు చెరుగుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీశారు. పిఠాపురం మున్సిపాలిటీ నందు పారిశుద్ధ సమస్యలతో, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని, పలు వార్డుల్లో విద్యుత్తు అంతరాయంతో వీధిలైట్లు సరిగా వెలగకపోవడం, ప్రతి వీధిలోనూ, డ్రైనేజీలు సర్లే ఇక కుళ్ళు నీరు చెత్త చెదారాలతో పేరుకుపోయి దోమలు బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారని, ప్రజా సమస్యలు మీరు గాలికి వదిలేసినారని, ఏనాడైనా వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి తిరిగారా అని నిలదీశారు. కేవలం ఓట్లు కోసమే వస్తారని, ప్రజలకు సమస్య వస్తే, కంటికి కనిపించని నాయకులు మీరా! పరిపాలన సాగించేదని, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిపాలన ఎన్నడూ చూడ లేదని, వార్డులోని ప్రజలను, మహిళలను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం పట్టణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో గొల్లప్రోలు సభ, కాపు నేస్తం సభకు వచ్చినప్పుడు 20 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామని బాహాటంగా చెప్పిన మీరు ఆ నిధులు ఏమయ్యాయి! దేనికి ఎంత ఖర్చు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల చేత ఓట్లు వేయించుకుని, కేవలం అధికారంలోకి వచ్చి ఎన్నో నెలలు గడుస్తున్న ఏనాడు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మున్సిపల్ చైర్మన్ గా పిఠాపురం పట్టణంలో తిరిగిన దాఖలాలు లేవని, ఒక మహిళా చైర్మన్ గా ఉండి పట్టణ ప్రజలకు, వార్డు ప్రజలకు, సరైన తాగునీరు, రోడ్లు, విద్యుత్ దీపాలు, డ్రైనేజీ సమస్యలను తీర్చి న్యాయం చేయవలసిన బాధ్యత మీకు లేదా అని నిప్పులు చెరిగారు. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని, ప్రజలంతా జనసేనాని వైపే చూస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి నిజాయితీగల నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ వారికి ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇప్పించాలని, నిజాయితీగల పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించేది ఒక జనసేన పార్టీ, మా నాయకుడు జనసేనాని మాత్రమేనని, మేము గర్వంగా చెప్పగలమని, ఈ సందర్భంగా ప్రజలకు జనసేనాని తరుపున హామీ ఇస్తున్నానని, జనసేన పార్టీని ప్రజలే గెలిపించుకోవాలని, నీతివంతమైన పాలన జనసేన అందిస్తుందని, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ప్రజలకు నిరంతరం అండగా నిలబడే వ్యక్తి అని ఈ సందర్భంగా మాకినీడి శేషకుమారి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుర్రా సూర్య ప్రకాష్, మేళం బాబి, చిన్న, కసిరెడ్డి నాగేశ్వరరావు, పబ్బిరెడ్డి దుర్గాప్రసాద్,
చిన్నబాబు, రాజకుమార్, లచ్చ బాబు, రవి, రాంబాబు, రమణ, నందు, సందీప్, నాయకులు జన సైనికుల తదితరులు పాల్గొన్నారు.