నమ్మి గెలిపించిన ప్రజల్ని నాశనమైపోవాలని శాపనార్ధాలు పెడతావా?

  • సంక్షేమమైనా, అభివృద్దయినా ప్రజాభీష్టం మేరకు జరగాలి
  • తొమ్మిదేళ్ల నీ పాలనలో తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?
  • అభివృద్ధిలో జిల్లాలోనే నియోజకవర్గాన్ని అట్టడుగు స్థానంలో ఉంచిన ఘనత మీదే
  • వైసీపీ పార్టీ ఆఫీసు ఎదురుగా.. నియోజకవర్గ నడిబొడ్డులో ఉన్న బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని ఇన్నేళ్ళుగా ఎందుకు బాగుచేయించలేకపోయావు?
  • మాయమాటలకు, కమల్ హాసన్ నటనలకు కాలం చెల్లింది
  • నీ పరిపాలన మీద ప్రజల్లో నమ్మకం పోయిందని గ్రహించే కదా కూతురికి అనధికార పెత్తనం ఇచ్చింది
  • ఓట్లేసి గెలిపించింది మీ నాన్నని నిన్ను కాదు అంటూ మీ కూతురిని ప్రజలు తిరస్కరిస్తుంది వాస్తవం కాదా?
  • ప్రజల పక్షాన మాట్లాడితే అసత్యాలు మాట్లాడినట్లా?
  • నిజంగా అభివృద్ధి చేస్తే జనసేన సహకరిస్తుంది మసిపూసి మారేడుకాయ చేస్తామంటే చూస్తూ ఊరుకోదు
  • జనసేన నేతలు ముస్తఫా గారిని దుర్భాషలాడారన్నది అవాస్తవం
  • జనసేన నేతలపై ఇష్టానురీతిగా మాట్లాడితే సహించేది లేదు
  • విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి
  • గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ముస్తఫాపై నిప్పులు చెరిగిన జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: ప్రజలు తన మీద ఎంతో నమ్మకంతో రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించటంలోనూ , నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనూ విఫలమైంది కాక గెలిపించిన ప్రజలనే నాశనమైపోవాలని శాపనార్ధాలు పెట్టడం ఎమ్మెల్యే ముస్తఫాకు తగదని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. జనసేన పార్టీ నేతలు తనను దుర్భాషలాడారు అంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు ముస్తఫా చేసిన వ్యాఖ్యలను ఆయన శుక్రవారం తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన మాట్లాడితే అసత్యాలు మాట్లాడినట్లా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తామంటే జనసేన సహకరిస్తుందని , మసిపూసి మారేడుకాయ చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు. జనసేన నేతలు ముస్తఫాని దుర్భాషలాడారన్నది అవాస్తవమన్నారు. తొమిదేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటూ నియోజకవర్గంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముస్తఫా చెప్పే మాయామాటలకు, చేసే కమల్ హాసన్ నటనలకు కాలం చెల్లిందని గ్రహిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గ నడిబొడ్డులో ఉండే బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఇన్నాళ్ళలో ఒక్క బొచ్చె మట్టి అన్నా పోశావా అని ధ్వజమెత్తారు.. ఎంతోమంది క్రీడాకారులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడే స్టేడియం నిరుపయోగంగా పడి ఉంటే అభివృద్ధి చేద్దామన్న ఆలోచనే కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేగా విఫలమై ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన ముస్తఫా ఇప్పుడు తన కూతురు నూరి ఫాతిమాను ఎమ్మెల్యే చేయాలంటూ ప్రచారం చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓట్లేసి గెలిపించింది నిన్ను కాదు మీ నాన్నను అంటూ నూరి ఫాతిమాను ప్రజలు తిరస్కరిస్తుంది వాస్తవం కాదా అని ధ్వజమెత్తారు. జనసేన నేతలను ఉచితార్ధంగా అంటే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. విమర్శలకు, ప్రతివిమర్శలకు సమయం వృధా చేసే కన్నా అధికారంలో ఉన్న ఈ తొమ్మిది నెలలన్నా నమ్మి గెలిపించిన ప్రజలకు సేవాలందించాలని ఆళ్ళ హరి ఎమ్మెల్యే ముస్తఫాకు హితవు పలికారు.