నకిలీ కాశీయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ అమీనాబాద్ నందు నకిలీ కాశీయ్య అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ నకిలీ కాశీయ్య కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వంకా కొండబాబు, ఎక్స్ సర్పంచ్ గరగ సత్యానందం, కొత్తపల్లి రాజు, మడదా ప్రసాద్, మడదా ఏసుబాబు, సూరడా ఏసుబాబు, రాచపల్లి గోపి, కారే మోసే, కోదా కుమార్, నాకేలే సతీష్, కారే దావీదు, ఓసిపల్లి ప్రసాద్ ఓసిపల్లి చిన్న మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.