బొబ్బిలి గ్రంధాలయ సమస్యని అధికార వైసిపి పట్టించుకోదా.?

బొబ్బిలి నియోజకవర్గం, బొబ్బిలి జెండా వీధిలో, సాయిగణపతి సినిమా హాలు ఎదురుగా ఉన్న గ్రంథాలయం శిదిలావ్యవస్థలో ఉందని జనసేన బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్ సంచాన మరియు బొబ్బిలి నాయకులు పల్లెం రాజా దుమ్మెత్తిపోసారు, వీరు మాట్లాడుతూ గత మూడు నెలల క్రితం గ్రంథాలయం సమస్యపై మున్సిపల్ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా సరే అధికారులు పట్టించుకోక పోగా తిరిగి అధికార వైస్సార్సీపీ నాయకులు కొంతమంది జనసేన పార్టీ నాయకులను పెయిడ్ ఆర్టిస్టులని, గ్రంధాలయం పనులు మరో వారంలో మొదలవుతాయని తెలుసుకొని ఇలా వినతిపత్రం ఇస్తున్నారని విమర్శలు చేసారు. కానీ ఇప్పటికీ గ్రంధాలయం పనుల సంగతి, తర్వాత అక్కడ ఉన్న పుస్తకాలను దొంగలు పడి దోచేస్తున్నారు. ఇప్పటికి ఇది రెండోసారి దొంగతనం జరగడం. ఎమ్మెల్యేని మీరు అధికారంలోకి రాగానే గ్రంథాలయం శాశ్వత బిల్డింగ్ నిర్మిస్తామన్న హామీ ఏమైంది? నాలుగన్నర సంవత్సరాల నుండి ఇదే మాట చెప్తున్న ఎమ్మెల్యే ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీ అభివృద్ధి? అని ప్రశ్నించారు. మీరు తక్షణమే గ్రంథాలయం మరమ్మతుల పనులు ప్రారంభం చెయ్యకపోతే జనసేన పార్టీ తరపున గ్రంథాలయ ప్రాంతంలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష చేసి ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చేలా మా నిరసనని తెలియజేస్తామని మా పోరాటం ఇంకా పటిష్టం చేస్తాం అని హెచ్చరించారు.