జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం

విశాఖపట్టణం: జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయంకై పేద ప్రజల ఆకలి నింపే ప్రయత్నంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ‘ఆహార నిధి‘ కార్యక్రమం కే.జి.హెచ్ వద్ద శుక్రవారం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ సంయుక్త జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో, జనసేన దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపి కృష్ణ(జి.కే) చేతుల మీదుగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసిన నీలం రాజు, పసుపులేటి మోహన్ మరియు నందకిషోర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.