మిలటరీ ఆసుపత్రిలో చేరిన డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. అయితే కరోనా బారిన పడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ ను చికిత్స కోసం సైనిక ఆసుపత్రికి తరలించినట్లు వైట్ హౌస్ శుక్రవారం ప్రకటించింది. అయితే తాను తన భార్య ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నట్లు ట్రంప్ ఒక వీడియో మెసేజ్ లో తెలిపారు. రాబోయే కొద్ది రోజుల పాటు అమెరికా అధ్యక్షుడు వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రి నుంచి పని చేస్తారని శ్వేత సౌధం అధికారులు తెలిపారు.

వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రికి వెళ్లేందుకు ఆయన శ్వేత సౌధంలోని తన నివాసం నుంచి దక్షిణం వైపు ఉన్న లాన్ గుండా నడుచుకుంటూనే వెళ్లి మెరైన్ వన్ (అమెరికా అధ్యక్షుడి విమానం) ఎక్కారని అధికారులు తెలిపారు. కేవలం స్వల్పమైన లక్షణాలే కనిపిస్తున్నాయని, ఆయన నిన్న రోజంతా పని చేశారని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కెలిగ్ మెకెన్నీ తెలిపారు.