ఇంటింటికి జనసేన సిద్ధాంతాలు.. జనసేన భావజాలం

ఇంటింటికి ఇంటికి జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావజాలం తెలిసే తెలియజేయాలనే ఉద్దేశంతో… జనసేన పార్టీ కార్యకర్తల సహకారంతో సోమవారం జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం లో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి కిట్లు అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మనోగత పుస్తకంలోని ఉన్న కొన్ని అమూల్యమైన విషయాలను కుటుంబాలకు తెలియజేసి.. వారు మరో పది మందిని ఉత్తేజ పరిచే విధంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు కొండా దేవా గౌడ్, మిద్దె సాయి కుమార్, కొండ సాయి, మిద్దె ప్రసాద్ గౌడ్, మాడ్డీ ప్రసాద్ మరియు సాయి వంశీ కార్యకర్తలు పాల్గొన్నారు.