మహబూబ్ నగర్, బొగ్గిడివారిపల్లి గ్రామాల్లో ఇంటింటికి జనసేన

*ఇంటింటి ప్రచారం చేస్తున్న జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

సిద్ధవటం: రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు.. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 14వ.రోజు సిద్ధవటం మండలంలోని మాధవరం-1పంచాయతీ లోని మహబూబ్ నగర్, బొగ్గిడివారిపల్లి గ్రామాల్లో ఇంటింటి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని జనసేన సిద్ధాంతాలను రూపొందించిన కరపత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.