పోలిశెట్టి ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన

  • గాజు గ్లాస్ గుర్తు కు ఓటేద్దాం.. పవన్ అన్నను గెలిపిద్దాం
  • ఇంటింటికి జనసేన 4వ రోజు పర్యటన

రామచంద్రపురం నియోజకవర్గం: కాజులూరు మండలం, గొల్లపాలెం గ్రామంలో ఇంటింటికి జనసేన రెండవ రోజు కార్యక్రమాన్ని ఎస్సీ కాలనీ మరియు యనమల వీధిలో రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు మండల అధ్యక్షులు బోండా వెంకన్న నిర్వహించచడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ 4 రోజుల పర్యటనలో భాగంగా ఇంటింటికి జనసేన కార్యక్రమంలో తణుకు వాడ, శలపాక, డేగల పేట, గొల్లపాలెం గ్రామాలు పర్యటించి ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, నిజాయితీ, ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు తెలియజేసి పార్టీ చేసే కార్యక్రమాలు ప్రజల లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ స్పందించి మా జనసేన పార్టీని ఆశీర్వదించి భవిష్యత్ కాలంలో జనసేన పార్టీ విజయం వైపు వెళ్లాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రతి గ్రామంలోని ప్రజలు తీవ్ర స్థాయిలో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వారికి జనసేన తరఫున అండగా ఉంటామని తెలిపారు. ముఖ్యంగా పంచాయతీ చేయవలసిన ఏ కార్యక్రమాలు నిర్వర్తించడం లేదు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు సమస్యలతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే వేరే ఇతర తరలించడం వలన గ్రామ అభివృద్ధి లేకుండా చేయడం జరిగింది. ప్రజల్లో మార్పు వచ్చింది. ఇంకా ప్రభుత్వంలో మార్పు రావాలి. జగన్ పోవాలి పవన్ రావాలి. అప్పుడే రాష్ట్రమంతా అభివృద్ధి దిశగా కనబడుతుంది. గొల్లపాలెం గ్రామంలో చర్చిలోని ప్రజలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పార్టీలకు అతీతంగా నా సంపాదనలో కొంత భాగంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో డొక్కా సీతమ్మ ఆసరా పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ కుటుంబాల్లో ఎవరైనా మరణించినట్లయితే వారి కుటుంబానికి అండగా నిత్యవసర సరుకులు, కిరాణా కూరగాయలు అందజేయడం జరుగుతుందని పోలిశెట్టి చంద్రశేఖర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న, మండల యూత్ అధ్యక్షులు కూనపురెడ్డి శివ కృష్ణ, జిల్లా కార్యదర్శి సంపత్, రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతా బత్తుల విజయ్ కుమార్, గంగవరం మండల అధ్యక్షులు చిర్రాజకుమార్, మండల కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు తదితర నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.