అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలి

  • జనసేన ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం
  • సామాన్యుడి సేన జనసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం
  • జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ డా. మాధవ రెడ్డి

శేర్లింగంపల్లి నియోజకవర్గం: నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసేన పార్ఠీ ఆధ్వర్యంలో బుధవారం అడిషనల్ కలెక్టర్ డాక్టర్ తిరుపతి రావు కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ డా. మాధవ రెడ్డి మాట్లాడుతూ.. జనసేన పార్టీ బీద, బడుగు, బలహీన వర్గాలను సాధికారత దిశగా తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కృషి చేస్తున్నదని, శేరిలింగంపల్లి నియోజకవర్గం అనేక రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ, ఇప్పటికీ దారిద్ర రేఖకు దిగువనున్నటువంటి ప్రజలు లక్షల్లో ఉన్నారని, వందల కొద్ది మురికి వాడలలో లక్షలాదిమంది ప్రజలు తెలంగాణ నలుమూలల నుండి బతుకుతెరువు కొరకు వచ్చి అద్దె ఇండ్లల్లో బతుకు బండిని ముందుకు నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి ఎన్నో ఆశలు కల్పించి ఎంతో ఆర్భాటంగా, డబుల్ బెడ్ రూం ఇండ్లు నా మానస పుత్రిక అని ఉత్తర ప్రగల్బాలు పలికి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేటికీ ఆయా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బీద బడుగు మీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కేటాయించకపోవడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా స్థానికంగా లింగంపల్లి పరిధిలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని అర్హులైన బీద బడుగు బలహీన వర్గాలకు, దారిద్యరేఖకు దిగువగా ఉన్న సామాన్య ప్రజానీకానికి వెంటనే కేటాయించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు బిఆర్ఎస్ నాయకుల భిక్ష కాదు, తెలంగాణ రాష్ట్ర బీద బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కు అని జనసేన పార్టీ భావిస్తున్నది. తెలంగాణ ప్రజానీకం అనేక రకాలుగా చెల్లించిన పన్నులతోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించారు తప్ప ప్రగతి భవన్ నుండి వచ్చిన ధనంతో నిర్మించినవి ఏమాత్రం కాదనే విషయాన్ని బిఆర్ఎస్ నాయకులు గాని, ప్రభుత్వ యంత్రాంగం గాని గుర్తుంచుకోవాలని జనసేన పార్టీ హితవు పలుకుతుంది. త్వరిత గతిన ప్రభుత్వం మరియు ప్రభుత్వ యంత్రాంగం మరియు కలెక్టర్ గారు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక పథకం ప్రకారం ప్రభుత్వమే తగినన్ని అర్హతలు తగిన నియమాలు నిబంధనలను రూపొందించి నిష్పక్షపాతంగా అర్హులైన శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది. లేని యెడల రానున్న రోజుల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏ ప్రజాప్రతినిధిని కూడా తిరగనివ్వబోయేది లేదని హెచ్చరిస్తూ, రానున్న రోజుల్లో సామాన్యుడి సేన అయినటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో బీద బడుగు బలహీన వర్గాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి నాయకులు కళ్యాణ్ చక్రవర్తి, హనుమంతు నాయక్, ప్రశాంత్, బి.అరుణ్ కుమార్, దుర్గాప్రసాద్, సందీప్, శ్రవణ్, గాంధీ, అశోక్, దాక్షాయిని, ప్రవీణ్ మరియు ఇతర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.