ముమ్మిడివరంలో ఘనంగా డా.బాబు జగ్జీవన్ రామ్ కు ఘననివాళులు

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ పోలవరం మండలం, మురమళ్ల గ్రామం మరియు టీ.కొత్తపల్లి, అడివిపేట గ్రామంలో మరియు నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో డా.బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాల వేసి జనసేన పార్టీ తరుపున ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ నిరుపేద కుటుంబంలో జన్మించి, దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జనసేన పార్టీ పార్లమెంట్ నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్ పాల్గొన్నారు మరియు మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, ఎంపీటీసీ లంకెనపల్లి జమ్మి, ఎమ్మార్పిఎస్ నాయకులు సవరపు వెంకట్ మరియు పలివెల వెంకటేశ్వర రావు, నరహరిశెట్టి రాంబాబు గంజా ఏసు, దూడల స్వామి,లంకెనపల్లి వెంకటేశ్వరరావు, చెల్లుబోయిన చిన్నబాబు, సలాది రాజా, లింగోలు పండు, ఆర్.డి.ఎస్ ప్రసాద్, డాక్టర్ నాగ మానస, కడలి కొండ, పెన్నాడ శివ, వంగా విజయసీతారాం, అద్దంకి గౌరీ శంకర, గంజా శ్రీను, మట్టపర్తి రామకృష్ణ, మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.