డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ ఎందరికో స్ఫూర్తి!

  • అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తాం.. అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసిన కోట్ల రాఘవేంద్ర రెడ్డి, బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున

డోన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందరికో స్ఫూర్తి ఆ రోజుల్లోనే ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగమును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమానికి డోన్ బిజెపి టిడిపి జనసేన త్రిముఖ కూటమి ఎంఎల్ఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోట్ల రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తాం అని పేర్కొన్నారు. బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నట్లు దేశం అభివృద్ధి చెందాలంటే రంగుల గోడలు, అద్దాల మేడలు, ఎత్తైన భవనాలు కాదు నిర్మించాల్సింది పౌరులు యొక్క అభివృద్ది జరిగినప్పుడే నిజమైన పౌరుల అభివృద్ధి జరిగినట్లు అని పేర్కొన్న మాట వాస్తవం. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ అన్ని రకాల వర్గాల పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడమే దీనికి ఉదాహరణ అని పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి డోన్ అసెంబ్లీ కన్వీనర్ సందు వెంకట రమణ, జిల్లా కార్యదర్శి వడ్డే మహారాజ్, జనసేన నాయకులు బ్రహ్మం, చరణ్, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు హేమ సుందర్ రెడ్డి,జిల్లా ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరణి చంద్ర శేఖర్, అధ్యక్షులు భరణి రమేష్, ఓబీసీ మోర్చ నాయకులు కే సి మద్దిలేటి, రాఘవేంద్ర ఆచారి, డోన్ మండల అధ్యక్షులు రవికుమార్, రాజశేఖర్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రామయ్య, నాగార్జున, ఇతర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.