రత్నాల చెఱువు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన జనసేన నాయకులు

  • మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే నిర్లక్ష్యం వల్లే రత్నాల చెరువు ప్రజలకు ఈ దుస్థితి
  • అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి జనసేన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్

మంగళగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీ రావు మరియు జనసేన నాయకులతో కలిసి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సమీపంలో ఉన్న రత్నాల చెఱువు ముంపు ప్రాంతంలో నీట మునిగిన ఇళ్లను, నీట మునిగిన చేనేత మొగ్గాలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గత మూడు నెలల క్రితమే గుంటూరు ఛానల్ కాలువలో పూడిక మరియు గుర్రపు డెక్కను తొలగించాలని కాజా గ్రామంలో ఉన్న గుంటూరు ఛానల్ కాలవ వద్ద కాజా గ్రామ కమిటీ సభ్యులతో కలసి జెసిబిల సాయంతో కొత్తిమీర తొలగించి అధికార ప్రభుత్వానికి చెంపపెట్టుగా కార్యక్రమాన్ని నిర్వహించి తక్షణమే గుంటూరు ఛానల్ కాలువలో పేరుకుపోయిన గుర్రప్ప డెక్కను, పూడికను తొలగించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశాం. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినందు వల్లే ఈ రోజున కొద్దిపాటి వర్షాలకే గుంటూరు ఛానల్ కాలువ నిండిపోయి కాలంలోని నీళ్లు గుంటూరు ఛానల్ కి ఆనుకొని ఉన్న గ్రామాలకు, కాలనీలకు నీరు చేరుకొని ఇల్లులు నీట మునుగుతున్నాయి. వైసిపి ప్రభుత్వం వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఆపద వస్తే ఆపద వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెబుతారు తప్ప ఆపద రాకముందే ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానిమీద ఆలోచించరు. గురువారం ఉదయం మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి రత్నాల చెఱువు ముంపు ప్రాంతాన్న పరిశీలించామంటూ ప్రజలు పడుతున్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోకుండా రోడ్డు మీద నుంచొని నాలుగు ఫోటోలు తీసుకొని వెళ్లిపోయారు. గత పది సంవత్సరాల నుంచి రత్నాల చెరువులో ఇదే పరిస్థితి గత ప్రభుత్వంలోనూ దీనిపైన చర్యలు తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలను పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజల సమస్యలను గాలికి వదిలేశారు వైసీపీ ప్రభుత్వం వారు. సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు నాయకులు ప్రశ్నిస్తుంటే సమస్యల పరిష్కారాలు వదిలేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిడతం పనిగా వైసీపీ ప్రభుత్వం వారు వ్యవహరిస్తున్నారు. ఈ రోజున చూస్తుంటే రత్నాల చెరువు ముప్పు ప్రాంతంలో ఇళ్లల్లోకి నీరు చేరుకోవటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అలాగే చేనేత మగ్గం ఉన్న ఇళ్లల్లోకి మగ్గం గుంటల్లో నీరు చేరుకుపోయి చేనేత కళాకారులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని ఇంత దారుణమైన పరిస్థితి రాకముందే జనసేన పార్టీ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. గుంటూరు ఛానల్ కాలువలో గుర్రపు డెక్క, పూడిక వెంటనే తొలగించాలని కోరిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయటం వల్లే ఈ రోజున ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సొంత మొగ్గం ఉన్న చేనేతలకు నేతన్న నేస్తం అంటూ ఈ వైసీపీ ప్రభుత్వం వారు సంవత్సరానికి 24 వేల రూపాయలు ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు తప్పితే ఈ రోజున మంగళగిరి అంటేనే చేనేతకు ప్రసిద్ధి అలాంటి మంగళగిరి నియోజకవర్గంలోనే దాదాపుగా 2 వేలు మంది పైసలుకు చేనేత కళాకారులు ఉంటే ఈ వైసీపీ ప్రభుత్వం వారు 4 వందల మందికి ఇచ్చి అర్హులైన చేనేతలందరికీ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. రత్నాల చెరువులో ముప్పు ప్రాంతంలో నీట మునిగిన చేనేత కళాకారుల ఇల్లులను సందర్శిస్తే మొగ్గం గుంటల్లో మోకాలు ఎత్తు నీళ్లు నిండి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. సొంత మొగ్గం ఉన్న నేతన్న నేస్తం రావట్లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదని చేనేత కళాకారులు చిల్లపల్లి శ్రీనివాసరావు కు వివరించారు. స్థానిక ఎమ్మెల్యేకి సంబంధిత అధికారులకు ఒకటే చెబుతున్నాం ఇప్పటికైనా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), కాపు సంక్షేమ సేన మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు మరియు ఎంటిఎంసీ జనసేన పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు తిరుమలశెట్టి కొండలరావు, ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు షేక్ కైరుల్లా, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, ఎంటిఎంసీ కార్యదర్శి షేక్ వజీర్ భాష, మంగళగిరి పట్టణం 21వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు నాగులపల్లి కామేష్, మంగళగిరి పట్టణం 22వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు చింతిరాల బాబురావు, 21 &22 వార్డు జనసేన పార్టీ కమిటీ సభ్యులు, రత్నాల చెరువు జనసైనికులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.