పి.గన్నవరం జనసేన ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

జాతీయ నాయకుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భముగా పి.గన్నవరం 3 రోడ్డు సెంటర్ వద్ద అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు సాదనాల శ్రీ వెంకట సత్యనారాయణ (జేడీ), జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి వాసంశెట్టి కుమార్, యడ్ల యేసు భాస్కర్ రావు, ఆదిమూలం వెంకటేశ్వరరావు, యడ్లపల్లి రాము, తాటికాయల వెంకటేష్, నల్ల మణికంఠ తదితర జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.