గాజువాకలో డా.బి.అర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు

గాజువాక జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా పూలమాలతో నివాళులర్పించడం జరిగింది. ప్రపంచాన్ని సృష్టించింది ఆ పరమేశ్వరుడు అయితే యావత్ ప్రపంచ దేశాలు అన్నీ ఆచరించే మన భారతదేశం రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈరోజు మన భారతదేశంలో ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తున్నారు అంటే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులే మన భారతదేశంలో మనకు నచ్చినట్టుగా జీవించగలుగుతున్నాం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని అనేక చట్టాలను స్వార్ధ రాజకీయ నాయకులు దోపిడీ రాజకీయ నాయకులు పాటించకుండా వాళ్లకు నచ్చినట్టుగా చట్టాలను మార్చుకుంటున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ఒక కులానికి ఒక వర్గానికి అంటగడుతున్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఒక్క కులానికో ఒక వర్గానికి ఒక మతానికో నాయకుడు కాదు భారతదేశం మొత్తానికి నాయకుడు. ప్రతి ఇంటిలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని పూజించుకోవాలి. తాను రచించిన చట్టాలు పాటించాలి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చట్టాలను గౌరవించే వ్యక్తిలు ఎవరైనా ఉన్నారంటే అది జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మాత్రమే, మన దేశం కోసం మన దేశ స్వతంత్రం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ గౌరవిస్తుంది… డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన చట్టాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా జనసేన పార్టీ ఎప్పుడు పోరాడుతుందని తెలిపారు.