పాడేరు మండలం పంచాయితీల నాయకులకు డా.గంగులయ్య దిశానిర్దేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు శుక్రవారం జనసేనపార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్ఛార్జ్ డా.గంగులయ్య పాడేరు మండలంలో గల వివిధ పంచాయితీల నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ జనసేనపార్టీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతున్న కూడా ఇంకా మారుమూల పల్లెల్లో ఉన్న జనసైనికులకు స్పష్టమైన ఎన్నికల సమాయత్త సందేశం చేరేలా క్షేత్రస్థాయిలో పర్యటన చెయ్యాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ నియమించి వారికి మండలంలో గలా 26 పంచాయతీలకు పార్టీ బలోపేతం కోసం ఇన్ఛార్జ్స్ గా నియమించాలని తీర్మానించడం జరిగింది. అవసరం అనుకున్న చోట అందరు కలిసి కట్టుగా పని చెయ్యాల్సివుంది అందుకు తగిన రీతిగా కార్యచరణతో ముందుకెళ్లాలని డా.గంగులయ్య తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా మండలంలో గలా అన్ని పంచాయతీలను పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటన పూర్తి చేసిన తర్వాత మండల కమిటీలో మరికొంత మంది జనసైనికులకి ప్రాధాన్యత కల్పిస్తూ వారికి సముచితమైన స్థానం ఇచ్చేందుకు తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేసేలా నిర్ణయిస్తూ అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్ఛార్జ్ డా.గంగులయ్య 10 మందితో కూడిన పంచాయితి ఇన్చార్జ్ లతో వచ్చేనెల 7 తేదీన జనసేనపార్టీ మండల కమిటీ పున: నియామకం చేసేలా తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, దుర్గలత, ప్రధాన కార్యదర్శి చిన్నబ్బాయి, మాదేల నాగేశ్వరరావు, పవనిజం సురేష్, సోమరాజు, మత్స్యబాబు ఐటి ఇన్చార్జ్ సాలేబు అశోక్, చందు తదితర జనసైనికులు పాల్గొన్నారు.