ఉగాది వేడుకలలో డాక్టర్ కందుల

  • జీవితంలో సుఖ దుఖాలు, మంచి చెడులు సమపాళ్లలో ఉంటాయనే అర్థాన్ని చెప్పేదే ఉగాది
  • విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్. కందుల నాగరాజు

వైజాగ్ సౌత్: తెలుగువారి తొలి పండుగ, తెలుగు నెలల్లో ప్రారంభయ్యే రోజు. షడ్ రుచులతో జీవిత పరమార్ధాన్ని చెప్పే పండుగ ఉగాది. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. మంగళవారం అల్లపురం పార్టీ కార్యాలయంలో ఉగాది పండుగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను సత్కరించారు. వారికి పంచాంగాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిగా చేసుకుంటున్నారని చెప్పారు. చైత్రమాసం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ఉగాదిని జరుపుకుంటారని అన్నారు. గుమ్మాలకు మామిడి ఆకులు, రంగు రంగుల పూలతో అలంకరణలు.. ఆరు రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమని.పేర్కొన్నారు. చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, వగరుతో ఉగాది రోజు పచ్చడి చేయడం ఆనవాయితీ అని జీవితంలో సుఖ దుఖాలు, సంతోషం, బాధ, మంచి చెడులు సమపాళ్లలో ఉంటాయనే అర్థాన్ని చెప్తూ… ఉగాది పచ్చడిని తయారు చేస్తారన్నారు. చైత్ర మాసంతోనే తెలుగు నెల ప్రారంభం అవుతుందని ఉగాది నుంచే అన్ని పండుగలు మొదలవుతాయని అన్నారు. అందుకే దీన్ని యుగారంభంగా చెప్తారని తెలిపారు. ఈ సీజన్లో లేలేత చిగుర్లు వస్తాయని వేప పూత, మామిడి కాత, చింత కాయలు ఈ సీజన్లోనే వస్తాయని అందుకే ఉగాది పచ్చడి తయారీకి అప్పుడే కాస్తున్న మామిడి కాయలు, చింత పండు, వేప పూత, చెరుకు రసాన్ని ఉపయోగిస్తారన్నారు. ఇక కొత్త బట్టలు కట్టుకొని ఉదయాన ఇంట్లో పూజలు చేస్తారని ఈ పూజల్లో ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా తయారు చేసి,
ఇష్టదైవాలకు నైవేద్యంగా సమర్పిస్తారని చెప్పారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు.
ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లలో ప్రత్యేక పంచాగ శ్రవణాలు ఉంటాయని, ఉగాదికి పంచాంగ శ్రవణం ఎంతో ప్రత్యేకమైనదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.