వార్డు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన డాక్టర్ కందుల

  • 31, 32, 33 వార్డులో అధికారులతో కలిసి పర్యటన
  • కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం
  • 52వ రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట

వైజాగ్ సౌత్: ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపి తక్షణమే చర్యలు తీసుకోవాలని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు కోరారు. నియోజకవర్గంలోని పలు వార్డులలో చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, చాలా సార్లు స్థానిక ప్రజలు తమ సమస్యలపై విన్నవించినప్పటికీ స్పందించలేదని చెప్పారు. ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో చేపడుతున్న పవనన్న ప్రజా బాట నిరంతరంగా కొనసాగుతుంది. శనివారం నాటికి 52వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు జివిఎంసి అధికారులతో కలిసి 31, 32, 33 పర్యటించారు. ముఖ్యంగా భీమ్ నగర్ లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. డ్వాక్రా మహిళలకు సమావేశ మందిరం, అంగన్వాడి, డ్రయన్స్, కలుషిత, మంచినీరు సమస్యలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. వీటితోపాటు ఇక్కడ చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శివప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ కామేశ్వర రెడ్డి, కార్యకర్తలు కుమారి తదితరులు పాల్గొన్నారు.