పెళ్లి కుమార్తెకు డాక్టర్ కందుల చేయూత

◆ బంగారు తాళిబొట్టు, పట్టుచీర అందజేత
◆ నిర్విరామంగా సాగుతున్న పవనన్న ప్రజా బాట
◆ 97వ రోజు చేరిన కార్యక్రమం

విశాఖ, ప్రజా సేవే పరమావధిగా భావించి పలు సేవా కార్యక్రమాలను వరుసగా నిర్వహిస్తున్నారు దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పవనన్న ప్రజా బాట 97వ రోజు కార్యక్రమంలో భాగంగా 38 వార్డు శివాలయం వీధిలో ఉన్న పెళ్లి కూతురు ప్రవళికకు బంగారం తాళిబొట్టు, పట్టుచీర, జాకెట్, పసుపు – కుంకుమ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజాసేవ లక్ష్యంగా పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నానని చెప్పారు. సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో తను పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జనసేన నాయకులు వీర మహిళలు వీర సైనికులు తనకు అనువేధాలుగా సహకరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంల సిహెచ్ శ్రావణి, లుక్స్ గణేష్, త్రినాద, లక్ష్మణ్, రాజు, కుమారి, దుర్గ, కందుల కేదార్ నాధ్, కందుల బద్రీనాథ్, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.