విశాఖ దక్షిణంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు

  • దివ్యాంగురాలకి వీల్ చైర్ అందజేత
  • నియోజకవర్గం లో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి వినతుల వెల్లువ
  • ప్రజల నుంచి అనూహ్య స్పందన
  • ప్రజా సమస్యల పరిష్కారానికి డాక్టర్ కందుల చొరవ

విశాఖ దక్షిణ నియోజకవర్గం: జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో దివ్యాంగురాలు సబ్బవరపు లక్ష్మికి డాక్టర్ కందుల నాగరాజు వీల్ చైర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు, వాళ్ళ కష్టాలను నేరుగా వినేందుకు తాను నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు.రాజకీయ నాయకులు అనే కాకుండా తాను వ్యక్తిగతంగా కూడా అవసరమైన వారికి సహాయం చేసేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. తను చేస్తున్న కార్యక్రమాలకు జనసేన నాయకులు, వీరమహిళలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. తన సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నరేంద్ర, రాజు, త్రినాధ్, ప్రసాద్, రాజు, పి. రాజు, వై.ప్రసాద్, అప్పారావు, మణి, శేఖర్, గాజుల శ్రీను, పవన్, సురేష్, రూప, వర, శ్రీదేవి, పద్మ, సునీత, అరుణ, కోమలి, పుష్ప, సంధ్య, కుమారి, నళిని దేవి, జనసేన యువనాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.