యువతకు క్రికెట్ కిట్లు అందజేసిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం నందు అమీనాబాద్, ఉప్పాడ, మాయ పట్నం, సూరాడపేట, కొత్తపల్లి, వాకతిప్ప, గ్రామాలలోని యువకుల క్రీడ రంగాన్ని ప్రోత్సహిస్తూ యువతకు మరింత ఉత్సాహం పెంచేలా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ యువతకు క్రికెట్ కిట్లు అందజేసారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన యువత అన్ని రంగాల్లోను ముందు ఉండాలని, అదేవిధంగా క్రీడారంగంలో యువత ముందు ఉండాలని వారి క్రీడాస్పూర్తికి మరింత ఉత్సాహాన్ని అందించే విధంగా ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో క్రికెట్ కిట్లు అందజేసినట్టు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా యువతకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా యువతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని మొన్న జరిగిన యువశక్తి కార్యక్రమం కుడా యువత కోసమే ఏర్పాటు చేసినట్లు చెప్పిన డాక్టర్ పిల్లా శ్రీధర్ నియోజకవర్గంలోని యువతకు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్న దొర, వంక కొండబాబు, కొత్తపల్లి రాజు, మైలపల్లి రవి, పెనుపోతుల వీరబాబు, కాట్లు రాజు, జ్యోతుల శివ, మైలపల్లి రాజు, బొంతల వెంకటరావు , కోన రాంబాబు, బొజ్జ గోపికృష్ణ, కారాపురెడ్డి వెంకటేష్, మేడిశెట్టి కామేష్, సంజీవ్, మరియు క్రీడాకారులు, జనసైనికులు పలుపంచుకోవడం జరిగింది.