ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మహాసభలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కాకినాడలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఏ.పీ.ఎం.ఎఫ్) కాకినాడ జిల్లా మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ సభలో ప్రసంగిస్తూ గత ప్రభుత్వాలు మీడియా మిత్రులకు కొన్ని స్కీములు పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ ఒక్క స్కీము లేని పరిస్థితుల్లో మీడియా మిత్రులు ఉన్నారని, కనీసం చాలామందికి ఉండడానికి సొంత ఇల్లు కూడా లేని స్థితిలో ఉన్నారని, మనం పలానాచోట ప్రోగ్రాం అని చెప్పి మెసేజ్ పెడతాము అది 10 కిలోమీటర్లు అవ్వనివండి లేదా.. 20 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉండనివ్వండి తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి మరి వస్తారు ప్రోగ్రాంకి, కొంతమంది బైక్ షేర్ చేసుకుని వస్తారు, వీళ్లకు శాలరీ కూడా చాలా తక్కువ ఉంటుంది. వీరిలో కొద్ది మంది ఆర్దిక పరిస్థితి మాత్రమే బాగుందని, మీడియాని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉందని, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర కూడా చాలా ఉంటుందని, ఒక విషయాన్ని ప్రపంచానికి చూపించగల సత్తా నిజన్ని నిర్భయంగా మాట్లాడగల సత్తా మీడియాకు ఉందని, ఒక సామాన్యులకు అందే స్కీమ్స్ కూడా మీడియా మిత్రులకు అందట్లేదని, వీళ్ళ పడుతున్న ఇబ్బందులు, సమస్యలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని, జనసేన పార్టీ అధికారంలోకి రాగానే మీడియా మిత్రులకు పలు పథకాలు వచ్చేలాగా చేస్తామని, ప్రస్తుతానికి నా నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఇబ్బంది కలిగిన నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, అలాగే ప్రభుత్వం వారు కూడా ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులను ఆదుకోవాలని విన్నవించుకుంటున్నట్లు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రభుత్వాన్ని కోవడం జరిగింది.