జనసైనికుని వివాహ వేడుకలో “మత్స్యకారులకు బాసటగా జనసేన” పోస్టర్ విడుదల చేసిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ గ్రామం నందు జనసైనికుడు డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ జనసేన కార్యకర్త అయినటువంటి మైలుపల్లి రాజు వివాహ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వివాహ వేడుకల్లో పాల్గొని వరుడు రాజు వధువు జ్యోతిని ఆశీర్వదించడం జరిగింది. అనంతరం చేపల వేట మీద ఆధారపడ్డ రెండు లక్షల మత్స్యకార కుటుంబాలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేనున్నాను అని ధైర్యాన్ని ఇస్తున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం మత్స్యకారశాఖ కార్యాలయాల్లో విజ్ఞాపనలు అందించాలని స్పష్టం చేశారు. దానిలో భాగంగా మత్స్కారులకు బాసటగా జనసేన పోస్టర్ ను ఆవిష్కరించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు మత్స్కర నాయకులు పల్లేటి బాపన్నదొర, మత్స్యకార నాయకులు వంక కొండబాబు, జనసైనికులు సోదే రవి కిరణ్, పల్లెటి జాన్సన్, మైలపల్లి రవి, రాంశెట్టి రాంబాబు, మైలపల్లి రాజు, బొంతల వెంకటరావు, బడే అడవి రాజు , బడే మాసేను, చింతకాయల పూరి జగన్నాథం, తిత్తి హరి, బడే తాతారావు, మెరుగు ఆనంద్, మెరుగు నాగేష్, మెరుగు సతీష్, మచ్చ లక్ష్మణరావు, పుక్కల కుమార్ నియోజకవర్గ నాయకులు బొజ్జ గోపి కృష్ణ, పల్నాటి మధుబాబు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.