2డీజీ మందును ఎవరు, ఎలా వాడాలి.. డీఆర్డీవో గైడ్‌లైన్స్
కరోనాపై డీఆర్డీవో సంధించిన అస్త్రం 2డీజీ. పొడి రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఔషధం.. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లపై బాగా పని చేస్తున్నట్లు డీఆర్డీవో చెప్పింది. తాజాగా ఈ 2డీజీ మందును ఎలా వాడాలో చెబుతూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును వాడాలని స్పష్టం చేసింది. ఆ గైడ్‌లైన్స్‌లో ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్లకు ఇస్తున్న చికిత్సకు అనుబంధంగా ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
మోస్తరు నుంచి తీవ్ర కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లకు సాధ్యమైనంత త్వరగా డాక్టర్లు ఈ మందును ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది. గరిష్ఠంగా పది రోజుల పాటు దీనిని వాడొచ్చు.
నియంత్రణ లేని డయాబెటిస్, తీవ్రమైన గుండె జబ్బులు, ఏఆర్డీఎస్ వంటి వ్యాధులతో బాధపడే వారిపై ఈ ఔషధాన్ని ఇంకా పూర్తిగా పరీక్షించి చూడలేదు. అందువల్ల కాస్త ముందు జాగ్రత్త అవసరం.
ఈ 2డీజీ ఔషధాన్ని గర్భిణులు, బాలింతలు, 18 ఏళ్ల లోపు పేషెంట్లకు ఇవ్వకూడదు.
2DG@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను 2డీజీ ఔషధం సప్లై చేయాలని పేషెంట్లు, వాళ్ల అటెండర్లు ఆయా హాస్పిటల్స్‌ను కోరవచ్చు.
The 2DG medicine can be given to Covid-19 patients under the care and prescription of doctors. Directions for the usage of this drug for COVID19 patients as per DCGI approval are attached here for reference: DRDO pic.twitter.com/To3TgULdSn
— ANI (@ANI) June 1, 2021