జనసేన ఆధ్వర్యంలో త్రాగునీటి ప్లాంట్

టెక్కలి నియోజకవర్గం, సొంటి నూరు గ్రామంలో యూరోపియన్ జనసేన టీం వారి సహకారంతో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ ఆధ్వర్యంలో రెండు లక్షల యాబై వేల రూపాయలతో త్రాగునీటి ప్లాంట్ ను ఏర్పాటు చేయటం జరిగింది. తమ గత పర్యటన సందర్భంగా గ్రామ జనసేన నాయకుడు షణ్ముఖ మరియు గ్రామస్థులు తాము ప్రత్యేకంగా వేసవికాలంలో ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను మరియు గ్రామంలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలను కణితి కిరణ్ దృష్టికి తీసుకువచ్చారు వెంటనే స్పందించిన కిరణ్ యూరోపియన్ జనసేన వారికి ఈ విషయాన్ని తెలియజేయడంతో మంచి మనసుతో స్పందించిన యూరోపియన్ జనసేన బృందం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో రెండు లక్షల యాబై వేలు ఖర్చుతో రక్షిత మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేయించారు. ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామ పెద్దలు, గ్రామ జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని పవన్ కళ్యాణ్ కి, జనసేన పార్టీకి తమ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్కలి జనసేన నాయకులు షణ్ముఖ, రాంప్రసాద్, హరి, స్వాదీన్ తదితరులు పాల్గొన్నారు.