దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హౌస్‌ అరెస్ట్‌..!

సిద్ధిపేట కలెక్టరేట్‌ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని నివాసంలో.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు.

సిద్ధిపేట కలెక్టరేట్‌ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని నివాసంలో.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. సిద్ధిపేట కలెక్టర్‌ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. దుబ్బాక, సిద్ధిపేటలో 300 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 12 గంటలకు కలెక్టరేట్‌ను ముట్టడించి తీరుతామన్నారు ఎమ్మెల్యే రఘునందన్‌రావు. రైతులకు వరి విత్తనాలు విక్రయించవద్దని, దీనిని వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టుల నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా ఖాతరు చేయబోనంటూ సిద్ధిపేట కలెక్టర్‌ పి.వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర డీవోపీటీకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఇవాళ వరి సాగు విషయంలో కలెక్టర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చింది.