ఘనంగా దుసనపూడి బ్రహ్మాజీ జన్మదిన వేడుకలు

కైకలూరు నియోజకవర్గ యువ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో సామాజిక సేవలు మరియు జనసేన పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న దుసనపూడి బ్రహ్మాజీ జన్మదిన వేడుకలను ఆయన స్వగ్రామం ముదినేపల్లి మండలం వాడపల్లి గ్రామంలో జనసేన నాయకులు మోటేపల్లి హనుమన్ ప్రసాద్, పోకల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, జనసేన నాయకులు నల్లగోవుల చలపతి, బాసినసెట్టి కిషోర్, వెల్పురి నానాజీ, వర్రే హనుమాన్ ప్రసాద్, అంబుల భరత్ తదితరులు పాల్గొన్నారు.