మాట తప్పని, మడమ తిప్పని, నిద్దుర పోయిన ముఖ్యమంత్రి కి శుభోదయం పలుకుదాం: మర్రాపు సురేష్

*జనసేన పార్టీ సీనియర్ నాయకులు గజపతినగరం నియోజకవర్గం – మర్రాపు సురేష్

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై మరోసారి జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా గజపతినగరం నియోజకవర్గంలో రోడ్లపై ఉన్న పాడైపోయిన గుంతలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రతీ జనసైనికులు జులై 15,16,17 తేదీల్లో #GoodMorningCMSir అని వ్రాసి పోస్ట్లు పెట్టాలని గురువారం పత్రికా సమావేశం ద్వారా పిలుపునిచ్చారు. జూన్ నెల ముఖ్యమంత్రి నిర్వహించిన మున్సిపల్ అధికారుల సమీక్షలో ఈ జులై నెల 15 నాటికి రోడ్లపై గుంతలు ఉండవని మీడియా ముఖంగా ప్రకటన ఇచ్చారు. ఈ మాటతప్పని, మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్లు గుంతలు పూడుస్తామన్న సంగతి మరిచారని, నిద్దుర పోయిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియా దద్దరిళ్ళేటట్లు తట్టిలేపాలని అన్నారు, రోడ్ల మరమ్మత్తుల కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయలు దారి మల్లుతున్నాయి, సామాన్యుడి నుంచి వసూలు చేసే రోడ్ సెస్ ఏమైపోతుంది, గతంలో నిర్మించిన రోడ్ల బకాయిలు కాంట్రాక్టర్ల కు చెల్లింపులు చేయలేదు, ఈ నెల 10వ తేదీలోపు 2వేల కోట్ల రూపాయల తో 8 వేల కి.మీ. రోడ్లు మరమ్మతులు చేస్తాం అని ప్రగల్భాలు పలికింది ప్రభుత్వం.. కానీ ప్రతి చోటా గుంతల మయం గానే ఉంది, అధ్వాన్నంగా ఉన్న రోడ్ల వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ 2వ తేదీన కార్యక్రమం నిర్వహించినపుడు సమయంలో తూ తూ మంత్రంగా రోడ్లు పూడ్చి చేతులు దులుపుకున్నారు. గజపతినగరం నియోజకవర్గంలోను, అన్ని మండలాల్లోనూ, గ్రామాల్లోనూ రోడ్ల పరిస్థితి మరింత అద్దువానంగా మారిందని, ప్రజలంతా తీవ్రఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తోందని, జనసేన పిలుపుతో ఈసారి ప్రతీజనసైనుకులు ప్రభుత్వానికి మేలుకొలపాలని అన్నారు, పన్నులు సెస్ ల రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో విఫలం అయింది, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మోహన్ రావు, రామకృష్ణ (బాలు) మిడతాన్ రవికుమార్, గజపతినగరం నాయకులు ఆదినారాయణ, శ్రీను, సురేష్ రెడ్డి, చిన్న, సత్యనారాయణ పాల్గొన్నారు.