పలు పోస్టులభర్తీకి ECIL నోటిఫికేషన్

ECIL ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ఖాళీలు భర్తీ చేయడంలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ (ECIL)లో ఎంపికైన వారు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం 15 ఖాళీలున్నాయి. ఆయా ఉద్యోగాలు ఆధారంగా ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, హెచ్ఆర్, లా, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, లేక సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ ఉత్తర్ణతతో పాటు తగిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో ఈసీఐఎల్ పేర్కొంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపిక విధానం:  పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తులకు తుది గడువు: డిసెంబర్ 31, 2020.

అప్లికేషన్ పంపాల్సిన చిరునామా:

Additional General Manager & In-Charge, HR

IN-Charge, HR Personnel GROUP, Administative Office, Electronics Corporation Of India Limited, ECIL (POST), Hyderabad – 500062, Telangana

ఈసీఐఎల్ నోటిఫికేషన్:  ECIL Jobs 2020 Notification

అధికారిక వెబ్‌సైట్ – ECIL Official Website