నిస్వార్థ అభిమానానికి నిదర్శనం గుంతకల్ పట్టణ వీర మహిళ ఈరమ్మ: వాసగిరి మణికంఠ

గుంతకల్, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పై తన అంతులేని అభిమానాన్ని చాటుతూ గుంతకల్ పట్టణ వీర మహిళ శ్రీమతి ఈరమ్మ జనసేనాని టాటూ తన చేతి మీద ముద్రించుకుంది. ఈ విషయాన్ని గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠకి చూపిస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మాట్లాడుతూ వీరమహిళ ఈరమ్మకు కళ్యాణ్ పై గుండెల్లో గూడు కట్టుకున్న తన అభిమానాన్ని చేతిపై శాశ్వతంగా పచ్చబొట్టు వేసుకోవడాన్ని చూస్తుంటే గర్వంగా ఉందని, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నిస్వార్థమైన, నిజాయితీ నాయకుడు కళ్యాణ్ అని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని పని సుమారు 3000 వేల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉంటూ ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ అలా 30 కోట్లు దానం చేసిన అభినవ కర్ణుడు కళ్యాణ్, అంతేకాకుండా ఎంతోమంది, యువతి యువకులను సామాజిక బాధ్యతతో రాజకీయాల పట్ల ఆకర్షితులను చేసిన ఏకైక వ్యక్తి జనసేనాని అని, అందువల్లే ఆయనకు అభిమానులు ఉండరు, అందరూ భక్తులే ఉంటారు అనడానికి 100% నిదర్శనం గుంతకల్ వీర మహిళ ఈరమ్మ అని కొనియాడారు.