చర్యకు ప్రతి చర్య.. గుంటూరు జిల్లాలో సీఎం జగన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

  • ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వక్రీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు మరియు రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం అనే విషయాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి వాటి స్థానంలో వారి కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకొని అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలను తెలియజేస్తే లోపాలను సరి చేసుకోకపోగా ఆ మాటలు వక్రీకరించి రాష్ట్ర ప్రభుత్వమే వాలంటీర్లను రెచ్చగొట్టి బెదిరించి పోలీసులు అడ్డం పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం అనేది నీతిమాలిన చర్యగా, వైసిపి చేతకానితనానికి నిదర్శనంగా పరిగణిస్తున్నామని తెలియజేశారు. అలాగే వాలంటరీ వ్యవస్థ అనేది ఖచ్చితంగా రాజ్యాంగానికి విరుద్ధమైన వ్యవస్థ అని, ఈ వ్యవస్థ ద్వారా అనేక అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అనే మాటకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఈ పాయింట్ మీద ఎవరు డిబేట్ కి వచ్చినా సిద్ధమని తెలియజేశారు. అలాగే రాజ్యాంగబద్ధమైన స్థానంలో లేని వ్యక్తుల ద్వారా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల వ్యక్తిగత డేటా దొంగతనం చేస్తున్న అనే మాట ముమ్మాటికి వాస్తవమని తెలియజేశారు. ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని తెలియజేశారు. అలాగే సేకరించిన డేటా వైసిపి నాయకుల ద్వారా అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తుల చేతులకు వెళుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నడిపే రాజనీతి లేక వాలంటీర్ వ్యవస్థ అనే రాజ్యాంగేతర వ్యవస్థను తయారు చేసుకుని ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు నాటకాలు ఆడుతున్నారు అని తెలియజేశారు. వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వైసిపి చేస్తున్న ఆకృత్యాలను చూసి జనసేన పార్టీ బయపడదని పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాయబ్ కమాల్, జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యాలరావు బిట్రగుంట మల్లికా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్ నగర అధ్యక్షులు నేరేళ్ల సురేష్, కార్పొరేటర్ ఎర్రం శెట్టి పద్మావతి కార్పొరేటర్ లక్ష్మీ దుర్గ, జిల్లా & నగర నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.