వింత వ్యాధిపై అత్యవసర సమావేశం..

ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వెలుగుచూసిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలపై శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె.భాస్కర్ హుటాహుటిన ఏలూరు బయలుదేరారు. పూళ్లలో నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

అయితే కోమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో స్థానికులు ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఇప్పటి వరకు 14 మంది అస్వస్థతకు గురికాగా.. బాధితులను ఏలూరు, గుండుగొలనులోని హాస్పిటలకు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్న అనంతరం ఆరుగురు బాధితులు ఇంటికి చేరుకున్నారు.