ఉపాధి మరియు ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలి

అరకు నియోజకవర్గం, ముంచింగపుట్టు మండలం, పెదగుడ పంచాయితీ పొడ్డగుడ గ్రామానికి జనసేన పార్టీ అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొన్నేడీ లక్ష్మణరావు గ్రామ ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పూర్వం నుండి ఇప్పటి వరకు గ్రామ ప్రజలకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడం విచారకరమని, నాటు పడవల్లో చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం మరియు అధికారులు తక్షణం చొరవ తీసుకుని పోడ్డ గూడ గ్రామ ప్రజలకు ఉపాధి మరియు ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు.