ప్రతిభకు ప్రోత్సాహం.. యువతకు వికాసం..!: బత్తుల బలరామకృష్ణ

  • భూపాలపట్నం గ్రామపెద్దల ఆధ్వర్యంలో మెగా కబడ్డీ టోర్నీ ..
  • 400 మంది క్రీడాకారులు..30 కి పైగా టీమ్స్
  • పోరాహోరీగా జరగనున్న కబడ్డీ పోటీలు..
  • కబడ్డీ టోర్నీని రిబ్బన్ కట్ చేసి భూపాలపట్నం దివాన్ చెరువు గ్రామాల మధ్య మొదటి మ్యాచ్ టాస్ వేసిన టౌర్ని ని ప్రారంభించిన బత్తుల

రాజానగరం: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీసి, ప్రోత్సహించడమే ధ్యేయంగా భూపాలపట్నం గ్రామ సర్పంచ్ శ్రీమతి గుల్లింకల అన్నపూర్ణ లోవరాజు, ఇతర గ్రామ పెద్దల ఆధ్వర్యంలో.. రాజానగరం మండలం, భూపాలపట్నం గ్రామంలో మెగా కబడ్డీ టోర్నీని జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ప్రారంభించారు. ఈ కబడ్డీ టోర్నమెంట్లో విజేతలకు నగదు బహుమతులు సహా, వారికి కావాల్సిన జెర్సీ, తాగునీటి, ఇతర అవసరాలు అన్నిటినీ నిర్వాకులు సమకూర్చగా.. భూపాలపట్నం టీం కు జనసేన నేత గుల్లింకల లోవరాజు జెర్సీలు అందజేసారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో యువ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసి, ప్రోత్సహించడానికి జనసేన పక్షాన మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ టోర్నమెంట్ ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిరెడ్డి బాబులు, భూపాలపట్నం గ్రామపెద్దలు, జనసేన నాయకులు, జనసైనికులు, యువ క్రీడాకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.