రైతులకు మద్దతుగా జనసేన పార్టీ ఆద్వర్యంలో ఆందోళన

* రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి.
* కొనుగోలు చేసిన ధాన్యానికి‌ డబ్బులు వెంటనే ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేసారు.
* జనసేన పార్టీ ముమ్మిడివరం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆద్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి సివిల్ సప్లై ఆఫీసు వరకూ ర్యాలీ ధర్నా నిర్వహించారు.
* రైతులు జనసేన‌ నాయకులు ధర్నా చేస్తున్న ప్రదేశానికి వచ్చిన సివిల్ సప్లై అధికారిణి తులసి రెండురోజుల్లోగా రైతులు వద్దనున్న ప్రతీగింజనూ కొనుగోలు చేస్తామని హామీఇచ్చారు.
* ఇంతవరకూ రైతుల వద్ద నుండి రెండు లక్షల ముఫ్ఫై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసామని దానికి సంబంధించి నాలుగు వందల డెబ్బై కోట్లరూపాయలు రైతులకు ఆన్ లైన్ ద్వారా చెల్లించామని
* ఇంకా‌రైతులవద్ద ఆరువేల మెట్రిక్ టన్నుల‌ ధాన్యం మిగిలి ఉన్నట్లుగా తమకు సమాచారం ఉందని దానిని కూడా రెండురోజులలోగా కొనుగోలు చేస్తామని మీడియాకు తెలియచేసారు.
* సివిల్ సప్లై అధికారిణి తులసి, అగ్రికల్చర్ జెడి కె నాగేశ్వరరావు హామీతో రైతులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా విరమించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సానబోయిన మల్లికార్జునరావు, గుద్దటి జమ్మి, గోదశి పుండరీష్, జక్కం శెట్టి పండు, తాళ్లూరి ప్రసాద్, గోలకోటి వెంకన్న బాబు, మద్దింశెట్టి పురుషోత్తం, అత్తిలి బాబురావు, కడలికొండ, మోకా బాల ప్రసాద్, దూడల స్వామి, మాదాల శ్రీధర్, కర్రా దుర్గాప్రసాద్, సానబోయిన వీరభద్రరావు, ఎలమంచిలి బాలరాజు, మచ్చ నాగబాబు, లంకలపల్లి జమ్మి, విత్తనాల అర్జున్, గుద్దటి విజయ్, గొలకోటి సాయిబాబు, పాయసం సాయి, అడపా సాయి, గొలకోటి ఫణి, మునికోటి జాజి, మట్టపర్తి శంకర్, పితాని శివ, బండారు సతీష్, కొప్పిశెట్టి బాబీ, జగతా సతీష్ తదితరులు పాల్గొన్నారు.