జోరుగా క్రియాశీల సభ్యత్వాల నమోదు

నందిగామ, కంచికచర్ల ప్రమాదవశాస్తూ ఎవరైనా పార్టీ కార్యకర్తలు గాయపడినా, దురదృష్టవశాత్తు మరణించినా వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ముందు చూపుతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ క్రియాశీల సభ్యత్వం ద్వారా ప్రతి ఒక్కరికి భీమా చేయించారని కంచికచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నాయిని సతీష్ పేర్కొన్నారు. పట్టణంలోని నెహ్రూ సెంటర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎదురుగా ఏర్పాటుచేసిన జనసేన క్రియాశీల సభ్యత్వాల శిబిరం వద్ద జోరుగా సభ్యత్వాలు నమోదు కార్యక్రమం జరిగిందని ఆయన అన్నారు. గతంలో సభ్యత్వలను నమోదు చేయించుకున్న వ్యక్తులతో పాటు నూతన సభ్యత్వాల నమోదు పార్టీకి కొత్త బలాన్ని చేకూరుస్తుందని సతీష్ అన్నారు.దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీ చేయని ఒక గొప్ప కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షులు మొదలుపెట్టి, ప్రమాదం జరిగిన సమయంలో వైద్య ఖర్చులకు, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఉపయోగపడేలా భీమ పథకానికి తీసుకొచ్చారన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తకు ఒక అన్నయ్యలా భరోసాని కల్పిస్తూ ఆ కుటుంబాలకు అండగ ఉంటున్నారని అన్నారు. గతంలో కంటే ఎక్కువగా సభ్యతాలను నమోదు జరగడం శుభపరిణామని ఈనెల 28వ తేదీ వరకు క్రియాశీల సభ్యత్వాలు నమోదు చేసేందుకు అవకాశం ఉందని మండల పరిధిలోని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త అభిమాని సభ్యత్వం నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పుప్పాల వేణుగోపాల్, పెద్దినీడి హరిబాబు, గ్రంధి సుబ్రహ్మణ్యం, కుర్రా నాని, గోపిశెట్టి నాగలక్ష్మి, కోనేటి మౌళి, సాయి హేమంత్, పెరుమాళ్ళ సురేష్, దేవి రెడ్డి అజయ్ బాబు, వనపర్తి పద్మారావు, కుసునూరు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.