అంగన్‌వాడీలపై ఎస్మా అప్రజాస్వామికం

మదనపల్లిలో అంగన్వాడీ కార్మికులపై ఎస్మా చట్టం పెట్టిన కారణంగా మద్దతు పలికిన జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గంగారపు స్వాతి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా గంగారపు స్వాతి మాట్లాడుతూ 27 రోజులుగా అంగన్వాడీ కార్మికులు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం వారిని పిలిచి చర్చలు జరుపకుండా వారి మీద ఒత్తిడి తెచ్చి వారిని ప్రలోబాలకు గురిచేస్తున్నారని భవిష్యత్తులో మీ పోరాటం ఎంత వరకు చేసిన తుది వరకు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ కార్మికులు మీద ఎస్మా చట్టంను ఎత్తివేయాలన్నారు. అంగన్వాడీ కార్మికుల సమ్మెను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గమనిస్తూనే ఉన్నారని రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే అంగన్వాడీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఐటీ విభాగ నాయకులు లక్ష్మి నారాయణ, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, తోట కళ్యాణ్, ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, ప్రధాన కార్యదర్శి నవాజ్, సెక్రటరీ జనార్దన్, నరేష్, గుజిని శీనా, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.