వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కై ప్రతీ మహిళ ఒక ఝాన్సీ లక్ష్మీ భాయి కావాలి

  • మహిళా శక్తికి, స్త్రీ సౌర్యానికి ప్రతిరూపం ఝాన్సీ లక్ష్మీ భాయి
  • జనసేన పార్టీ బలోపేతంలో వీరమహిళలదే కీలకపాత్ర
  • వీర మహిళలను, పారిశుద్ధ్య కార్మికులను సారె పెట్టి ఘనంగా సన్మానించిన గుంటూరు అర్బన్ జనసేన పార్టీ అధ్యక్షుడు నెరేళ్ల సురేష్

గుంటూరు: వైసీపీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్రంలో బ్రిటీష్ పాలనను మించి నియంత పాలన సాగుతోందని, వైసీపీ విముక్తి ఆంద్రప్రదేశ్ కోసం ప్రతీ మహిళా ఒక ఝాన్సీ లక్ష్మీ భాయి కావాల్సిన చారిత్రక అవసరం ఉందని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. తొలి స్వతంత్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీ భాయి 194 వ జయంతిని జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి కొండూరు కిషోర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నెరేళ్ల సురేష్ మాట్లాడుతూ మహిళా శక్తికి, స్త్రీ సౌర్యానికి నిలువెత్తు ప్రతిరూపం ఝాన్సీ లక్ష్మీ భాయి అని కొనియాడారు. బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకుపుట్టించిన ఝాన్సీ లక్ష్మీ భాయి ధైర్య సాహసాల స్పూర్తితోనే జనసేన పార్టీ మహిళా విభాగానికి ఝాన్సీ లక్ష్మీ భాయి వీర మహిళలు అని పేరు పెట్టారని నెరేళ్ల సురేష్ అన్నారు. జనసేన పార్టీ కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గలు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన నైతిక దైర్యంతోనే వైసీపీ దురాగతలను చీల్చి చెండాడుతున్నామన్నారు. జనసేన పార్టీలో మహిళలకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం మరే పార్టీలోనూ ఉండదని, ఒక మహిళగా జనసేన పార్టీలో ఉన్నందుకు ప్రతీక్షణం గర్వపడుతున్నామన్నారు. వీర మహిళ అనసూయ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక, అధర్మ పాలనను అంతమొందించే క్రమంలో ప్రతీక్షణం తాము ఝాన్సీ లక్ష్మీ భాయి ధైర్య సాహసాలను స్మరించుకుంటామన్నారు. అనంతరం వీర మహిళలను, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులను దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధక్ష్యుడు చింతా రేణుకా రాజు , ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉదయ్, కొండూరు కిషోర్, నగర కమిటీ కార్యదర్సులు, సంయుక్త కార్యదర్సులు, వీర మహిళలు, రాజనాల నాగలక్ష్మి, మల్లేశ్వరి, ఆసియా, హరి సుందరి, గడదాసు అరుణ, జాన్ బీ, రాధిక, రజని, హైమావతి, సుజాత, ఆషా, కవిత, నగర కమిటీ బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, సోమి ఉదయ్, బుడంపాడు కోటి, తిరుమలశెట్టి కిట్టు, బందెల నవీన్, పుల్లంసెట్టి ఉదయ్, షర్ఫుద్దీన్, కోలా అంజి, వడ్డె సుబ్బారావు, గడ్డం రోశయ్య, పురాణం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.