ప్రతిఒక్కరూ యోగాభ్యాసం చేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఢిల్లీ : నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని… ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన భార్యతో కలిసి యోగా సాధన చేశారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలని కోరారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు.