అంబేద్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కు పొడిగించిన గడువు

అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం లో ప్రవేశాలకు తుది గడువును పొడిగించబడింది. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ తదితర కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని అక్టోబర్‌ 15 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అసక్తి గల విద్యార్థులు డిగ్రీ, పీజీ సహా ఆయా కోర్సుల్లో చేరడానికి పూర్తి వివరాలను https://braou.ac.in/లో పొందుపరచినట్టు వర్సిటీ అధికారులు తెలిపారు.

అధికారిక వెబ్‌సైట్‌లో కోర్సుల చేరిక కు కావలసిన విద్యార్హతతో పాటు కోర్సుకు సంబంధించిన ఫీజు తదితర వివరాలను పొందు పరిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలుంటే 73829 29570, 73829 29580, 73829 29590, 73829 29600 నెంబర్లలో లేదా అంబేద్కర్ వర్సిటీ సమాచార కేంద్రం 040 2368 0333 / 555 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.