దీప్‌సిద్ధూ కస్టడీ గడువు పొడిగింపు

పంజాబీ నటుడు దీప్‌సిద్ధూ పోలీస్‌ కస్టడీని ఢిల్లీ హైకోర్టు మరోవారంపాటు పొడిగించింది. ఆయన్ను అరెస్ట్‌ చేసిన తర్వాత కస్టడీ గడువు పూర్తయింది. దీంతో మేజిస్ట్రేట్‌ ముందు హారుపర్చారు. దీంతో ఆయన కస్టడీ గడువును కోర్టు పొడిగించింది. జనవరి 26న ఢిల్లీ పరేడ్‌లో ఉద్రిక్తతతకూ, దీప్‌ సిద్ధూకు సంబంధం ఉందనే అభియోగాలున్నాయి. దీంతో దీప్‌సిద్ధూ కొన్నిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈనెల 2న చండీగఢ్‌, అంబాలా మధ్య జిరాక్‌పూర్‌లో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.