క్రిస్ మస్ కానుకగా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’

తాజాగా వెబ్ వరల్డ్ లోకి కూడా అడుగు పెట్టిన సమంత ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా వస్తున్న ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతోంది. మనోజ్ బాజ్‌ పాయ్ లీడ్ రోల్ వచ్చిన మొదటి సిరీస్‌ విజయవంతమైన సంగతి తెలిసిందే. దీంతో యూనిట్‌ రెండో సీజన్‌ ను ప్లాన్ చేసి ఈ మధ్యనే షూటింగ్‌ కూడా వేగంగా పూర్తి చేసింది. ఈ సిరీస్‌లో సమంత పాకిస్థాన్ టెర్రరిస్ట్‌లా కనిపించనున్నట్లు సమాచారం.

స్టార్ హీరోయిన్ అయిన సమంత నెగిటివ్ రోల్‌ అందులోనూ టెర్రరిస్ట్‌ పాత్రలో కనిపించడం సాహసమనే చెప్పాలి. అయితే ఈ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద రకరకాల ప్రచారాలు జరగగా ఎట్టకేలకి ఈ వెబ్ సిరీస్ క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇటీవలే తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పి కాస్త హైప్ కూడా పెంచింది సమంత. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ వెబ్ సిరీస్‌ ముందు దీపావళికి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని భావించినా అన్ని బాషలలో ఒకే సారి అంటే క్రిస్మస్ కే రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు. ఇటీవల టెర్రస్‌పై వ్యవసాయం మొదలుపెట్టిన సమంత సాకి పేరుతో క్లాతింగ్ బిజినెస్‌ని కూడా ప్రారంభించేసింది. అలానే ఏకమ్ అనే ఒక స్కూల్ కూడా మొదలు పెట్టిన ఆమె ఈ ఏడాదే డిజిల్ వరల్డ్‌ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.