సుల్తాన్‌ ఫస్ట్ లుక్

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో కార్తీ తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్‌’. బక్కియారాజ్ కన్నన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ నిర్మించారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 90 శాతం లాక్ డౌన్ కి ముందు పూర్తయింది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ తిరిగి స్టార్ట్ కావటమే కాకుండా చిత్రీకరణ పూర్తి కూడా చేశారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది.

ఈ ఫస్ట్ లుక్‌లో కార్తీ టక్‌ చేసి.. చేతిలో వాలకర్రతో.. కార్తీ ఇచ్చిన మాస్‌ లుక్‌.. సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. ఇక ఈ ఫస్ట్ లుక్‌ విడుదల సందర్భంగా .. ”ప్రియమైన సోదర, సోదరీమణుల్లారా.. మీ ప్రేమాభిమానాలే.. మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. సుల్తాన్‌ చిత్ర ఫస్ట్ లుక్‌ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీకు నచ్చుతుందని ఆశిస్తూ.. ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను..” అని హీరో కార్తీ పోస్ట్‌ చేశారు. ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.