అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి: గాదె

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, పెదనందిపాడు మండలంలో ఉన్న వరగని గ్రామంలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు పరిశీలించారు.. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పొలాలు మునిగి 3 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుండి ఏ మాత్రం స్పందన లేకపోవడం, ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని తెలియచేస్తుంది అన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మానస పుత్రికగా చెప్పుకునే రైతు భరోసా కేంద్రాలు కేవలం పేపర్ లలో యాడ్స్ ఇచ్చుకోవడానికి మాత్రమే ఉన్నాయి అని, రైతు భరోసా కేంద్రాలలో కన్నా బయట విత్తనాల రేట్లు తక్కువగా ఉన్నాయి అని ఏద్దేవా చేసారు. అలాగే స్థానికంగా ఉన్న మేక వాగు పూడిక తీయకపోవడం వల్లనే పొలాలు మునిగి పోయాయి అని చెప్పారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి మేకతోటి సుచరిత గారు గతంలో చేసిన మంత్రి పదవి గాని ఇప్పుడు చేస్తున్న శాసన సభ్యురాలి పదవిని గాని నామ మాత్రంగానే ఉన్నారు అని నియోజకవర్గం అభివృద్ధిపై శ్రద్ద లేదు అని తెలియచేసారు. అలాగే రైతులకు తక్షణ సాయం చేయని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతుల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడతాం అని తెలియచేసారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాధ్, తుమ్మల నరసింహారావు, సాయి, రాజేష్, పెడనందిపాడు మండల అధ్యక్షులు కొల్లా గోపి, మండల నాయకులు దాసరి సాయి కృష్ణ, నూనె శ్రీను, బండి సైదేశ్వరావు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు..